Studio18 News - తెలంగాణ / : తెలంగాణ ఏసీబీ చీఫ్ సీవీ ఆనంద్ సోషల్ మీడియాలో పంచుకున్న ఓ వీడియో ఇప్పుడందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, ఒక కోతి కూడా టేబుల్ పై కూర్చుని ఫైళ్లు తిరగేస్తూ ఉండడం ఆ వీడియోలో చూడొచ్చు. తినడానికి అరటిపండు పెట్టినా, దాని జోలికి వెళ్లకుండా ఫైళ్లు పరిశీలిస్తూ ఆ కోతి యమా బిజీగా ఉండడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియో సీవీ ఆనంద్ సరదాగా వ్యాఖ్యానించారు. "అవినీతి అధికారులకు వల విసరడం, వారిని అరెస్ట్ చేయడం నుంచి కాస్త విరామం. ప్రలోభాలకు ఏమాత్రం లొంగని స్ట్రిక్ట్ ఆఫీసర్ రికార్డులను ఎలా తనిఖీ చేస్తున్నారో చూడండి" అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Admin
Studio18 News