Studio18 News - తెలంగాణ / : పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ ఇంటి వద్ద ఈరోజు బీఆర్ఎస్ సమావేశం నిర్వహిస్తామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు... హరీశ్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. శ్రీనగర్ కాలనీలో సబితా ఇంద్రారెడ్డిని, వెస్ట్ మారేడ్‌పల్లిలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. శంభీపూర్ రాజు నివాసం నుంచి ర్యాలీ శంభీపూర్ రాజు నివాసం నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా అరికెపూడి గాంధీ నివాసానికి బయల్దేరాలని నిర్ణయించారు. దీంతో గాంధీ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసులను మోహరించారు.
Admin
Studio18 News