Studio18 News - తెలంగాణ / : వినాయక చవితికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్న వేళ ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అధ్యక్షుడు రాజ్‌కుమార్ కీలక ప్రకటన చేశారు. ఖైరతాబాద్ గణేశుడికి ఏడు చందాలు చెల్లించే, అతిథులుగా పాల్గొనే భక్తులకు రెండు అపురూప గ్రంథాలను బహూకరించనున్నట్టు తెలిపారు. ప్రముఖ వైద్య సంస్థలు కిమ్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య సమర్పణలో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచించిన వంద పేజీల శ్రీ గణపతి భగవానుని పవిత్ర గ్రంథం ‘గణానా త్వా‘.. వారాహి చలనచిత్ర అధినేత సాయి కొర్రపాటి సమర్పణలో వచ్చిన గ్రంథం ‘శ్రీమాలిక’ను చందాలు చెల్లించిన వారికి అందించనున్నారు. వినాయక చవితి సందర్భంగా ఈ మంత్రమయ జ్ఞాపికలను లభించే అరుదైన అక్షర సంపదలను సమర్పించడం తన అదృష్టమని దానం నాగేందర్ పేర్కొన్నారు. శ్రీనివాస్ పరమాద్భుత విలువల ‘గణానా త్వా’ గ్రంథం ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని అనేక ఆలయాలకు చేరింది. ఇందులో శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కథతోపాటు విఘ్నేశ్వరుడి సౌందర్య చిత్రాలతో భక్తులను ఆకట్టుకుంటోంది. డెబ్బైకి పైగా ధార్మిక, ఆధ్యాత్మిక అపురూప గ్రంథాల్ని రచించి సంకలనం చేసి వేలమంది అభిమానులను సంపాదించుకున్న శ్రీనివాస్ గత రెండున్నర దశాబ్దాలుగా ఏటా వినూత్న శోభలతో వరసిద్ధి వినాయక చవితి పవిత్ర సంచికను అందిస్తున్నారు.
Admin
Studio18 News