Studio18 News - తెలంగాణ / : Telangana Budget 2024 : ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తొలిసారి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దాదాపు 70 పేజీలు ఉంది. దాదాపు గంట 50 నిమిషాల పాటు ప్రసంగించారు. 2లక్షల 91వేల 159 కోట్లతో ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. గతేడాది 2 కోట్ల 90లక్షల 396 కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అంతకంటే వెయ్యి కోట్లు అదనంగా ఈసారి కాంగ్రెస్ సర్కార్ పూర్తి స్థాయి బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టింది. బడ్జెట్ కేటాయింపుల్లో ప్రధానంగా వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారు. 72వేల 659 కోట్ల రూపాయలు కేటాయించారు. సంక్షేమానికి కూడా పెద్ద పీట వేశారు. ఓవరాల్ గా సంక్షేమం, వ్యవసాయం.. ఈ రెండింటింకి అత్యధిక ప్రాధాన్యం (వన్ థర్డ్ బడ్జెట్-లక్ష 10 కోట్ల కేటాయింపు) ఇచ్చారు. కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కేసీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. బడ్జెట్ విషయం లేదన్నారు. ఎలాంటి పాలసీకి సంబంధించిన అంశం ఇందులో లేదని కేసీఆర్ ఫైర్ అయ్యారు. ప్రజల ఆశలపై రేవంత్ సర్కార్ నీళ్లు చల్లిందన్నారు. ఈ బడ్జెట్ లో ఏ వర్గానికి కూడా లాభం లేదన్నారు కేసీఆర్. ఇక ఊరుకునేది లేదని, ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతామని కేసీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం, ప్రతిపక్షాల విమర్శలు, వాదనలు ఎలా ఉన్నా.. అసలు తెలంగాణ బడ్జెట్ ఎలా ఉంది? కేటాయింపులు ఏ విధంగా చేశారు? ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు? ఇలాంటి అంశాలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ..
Admin
Studio18 News