Saturday, 14 December 2024 07:34:56 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Murder Case: హత్యాయత్నం కేసు రెండేళ్ల తర్వాత హత్య కేసుగా మారింది... ఎలాగంటే...!

Date : 06 August 2024 03:09 PM Views : 48

Studio18 News - తెలంగాణ / : హత్యాయత్నం కేసులో నిందితులు రెండేళ్ల తర్వాత హత్య కేసు ముద్దాయిలుగా మారిపోయారు. ఎందుకంటే... రెండేళ్ల కిందట దాడిలో గాయపడిన బాధితుడు సుదీర్ఘకాలం మృత్యువుతో పోరాడి ఇటీవల మృతి చెందాడు. దీంతో కేసును హత్య కేసుగా మార్చినట్టు రాజేంద్రనగర్ ఇన్స్ పెక్టర్ క్యాస్ట్రో మీడియాకు తెలిపారు. వివరాల్లోకి వెళితే... నల్గొండ జిల్లా చింతపల్లి మండలం సాయిరెడ్డిగూడెంకు చెందిన వెంకటేశ్ గౌడ్ డిగ్రీ వరకూ చదివాడు. ఎస్ఐ రాత పరీక్షలకు సిద్ధమవుతూ చదువు ఖర్చుల కోసం రాత్రివేళ క్యాబ్ డ్రైవర్ గా పనిచేసేవాడు. ఆ క్రమంలో 2022 జూలై 31వ తేదీ రాత్రి వెంకటేశ్ గౌడ్ క్యాబ్ ను ఉప్పర్ పల్లికి చెందిన వివేక్ రెడ్డి ఎక్కాడు. అయితే వివేక్ రెడ్డి క్యాబ్ లో నిర్ణీత దూరం దాటి కొంచెం ఎక్కువ దూరం ప్రయాణించాడు. దీంతో క్యాబ్ డ్రైవర్ వెంకటేశ్ గౌడ్ అదనంగా రూ.200 లు ఇవ్వాలని కోరాడు. అయితే ఈ రూ.200 ల విషయంలో వివేక్ రెడ్డి, వెంకటేశ్ గౌడ్ మధ్య ఘర్షణ జరిగింది. క్యాబ్ డ్రైవర్ పై కోపంతో వివేక్ రెడ్డి తన స్నేహితులను రప్పించాడు. మద్యం మైకంలో ఉన్న వివేక్ రెడ్డి స్నేహితులు డ్రైవర్ వెంకటేశ్ గౌడ్ ను విచక్షణారహితంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్ రెడ్డి కోమాలోకి వెళ్లాడు. దీంతో వివేక్ రెడ్డి సహా 15 మందిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రెండేళ్లుగా ఆసుపత్రిలో కోమాలో ఉండి చికిత్స పొందుతున్న వెంకటేశ్ గౌడ్ ఆదివారం రాత్రి మృతి చెందాడు. నిన్న ఈ సమాచారం పోలీసులకు అందడంతో, తాజాగా నిందితులపై హత్య కేసు నమోదు చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :