Studio18 News - తెలంగాణ / : హైదరాబాద్‌తో సమానంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ అభివృద్ధికి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. శనివారం ఆయన వరంగల్ జిల్లాలో పర్యటించారు. వరంగల్ నగర అభివృద్ధిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హెరిటేజ్ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇన్నర్, ఔటర్ రంగ్ రోడ్డుకు భూసేకరణ పూర్తి చేయాలని, అందుకు అవసరమైన నిధుల వివరాలు ప్రభుత్వానికి అందించాలన్నారు. హైవేలను అనుసంధానిస్తూ వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు ఉండేలా చూడాలన్నారు. ఓఆర్ఆర్ నుంచి టెక్స్‌టైల్ పార్కును అనుసంధానించాలన్నారు. స్మార్ట్ సిటీలో భాగంగా భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి చేయాలన్నారు. నాలాల ఆక్రమణను అరికట్టాలన్నారు. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.
Admin
Studio18 News