Studio18 News - తెలంగాణ / : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవ చేస్తూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కోరుకున్నారు. కేటీఆర్‌కు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలన్నారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు పటోళ్ల కార్తీక్ రెడ్డి, క్రిషాంక్ తదితరులు ఆయనకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు.
Admin
Studio18 News