Studio18 News - తెలంగాణ / : హైదరాబాద్ లో డ్రగ్స్ దందా చేస్తున్న రాజస్థానీ గ్యాంగును శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలో తనిఖీలు చేస్తుండగా డ్రగ్స్ తరలిస్తున్న స్మగ్లర్లు పట్టుబడ్డారని చెప్పారు. నిందితుల దగ్గర 620 గ్రాముల హెరాయిన్ దొరికిందని పేర్కొన్నారు. పట్టుబడ్డ హెరాయిన్ విలువ మార్కెట్లో రూ.4.34 కోట్లు ఉంటుందని వివరించారు. ఈమేరకు ఎస్‌వోటీ పోలీసులు ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు టాస్క్ ఫోర్స్, ఎస్ వోటీ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్టులతో పాటు ప్రధాన కూడళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. వాహనాలను, అనుమానితులను ఆపి తనిఖీ చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఎస్‌వోటీ పోలీసులు గచ్చిబౌలిలోని టెలికాంనగర్‌లో నిర్వహించిన సోదాల్లో డ్రగ్ స్మగ్లర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. రాజస్థాన్ నుంచి నగరానికి డ్రగ్స్ రవాణా చేసిన ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో నలుగురు రాజస్థాన్ కు చెందిన వారని తెలిపారు.
Admin
Studio18 News