Studio18 News - తెలంగాణ / : అఖండ భారతావని కోసం ప్రాణాలర్పించన భరత మాత ముద్దు బిడ్డ జన సంఘ్ వ్యవస్థాపకులు డా. శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతిని వేడుకలను రాజన్న సిరిసిల్లా జిల్లా చందుర్తిలో భాజపా నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మహనీయునికి నమస్సుమాంజలి తెలియజేస్తూ వేములవాడ నియోజకవర్గం లోని చందుర్తి మండలం కేంద్రంలో బీజేపీ నేత డా.చెన్నమనేని వికాస్ నేతృత్వంలో మొక్కలు నాటి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Also Read : nagarkurnool : అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మన్ గా గార్లపాటి శ్రీనివాసులు
Admin
Studio18 News