Saturday, 14 December 2024 06:48:46 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

CM Revanth Reddy : కోర్టుల్లోనూ కొట్లాడతాం.. హైడ్రాపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Date : 11 September 2024 12:43 PM Views : 38

Studio18 News - తెలంగాణ / : CM Revanth Reddy On Hydra : సీఎం రేవంత్ హైడ్రాపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ చెరువులను ఆక్రమించిన వారిని వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. చెరువులను ఆక్రమణల నుంచి విడిపించేందుకే హైడ్రా ఏర్పాటు చేశామని రేవంత్ అన్నారు. బుధవారం తెలంగాణ పోలీసు అకాడమీలో నిర్వహించిన ప్రాసింగ్ అవుట్ పరేడ్ లో ఆయన ముఖ్యఅతిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా హైడ్రా గురించి మాట్లాడుతూ.. 1908లో హైదరాబాద్ మహానగరంలో వరదలు ఉప్పెనలా కమ్మేసి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆనాటి నిజాం సర్కార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆర్కిటెక్ గా నియమించి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించి హైదరాబాద్ నగరానికి తాగునీటి సౌకర్యం కల్పించింది. ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూ ఆక్రమించి ధనవంతులు ఫామ్ హౌజ్ లు కట్టుకున్నారు. వాళ్లఇళ్ల నుంచి వచ్చే డ్రైనేజీ గండిపేట నీళ్లలో కలిస్తే.. ఆ నీళ్లు తాగడానికి నగర ప్రజలకు ఇస్తున్నారు.. వాటిని అడ్డుకోకుంటే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్లుగా కాదా? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చెరువులను ఆక్రమించి అడ్డగోలుగా నిర్మాణాలు చేయడం వల్ల వరదలు వచ్చి పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నాయి. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం.. చెరువులను ఆక్రమించి ఇల్లు నిర్మించినోళ్లు ఎంత పెద్దోళ్లయినా నిర్మాణాలు కూల్చకుండా వదిలిపెట్టేది లేదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆక్రమించుకున్న చెరువులను మీరే వదిలిపెట్టి గౌరవంగా పక్కకు తప్పుకోండి.. నీటిపారుదల శాఖకు అప్పగించండి. మీరు ఖాళీచేయనంటే ఉన్నపళంగా నేలమట్టం అవుతాయి. కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో, నాలాల్లో అక్రమంగా నిర్మాణాలను మేం తొలగిస్తాం. మీరు కోర్టులకు వెళ్లినా.. కోర్టుల్లో కొట్లాడతాం. మీ ఆక్రమణలను తొలగిస్తామని రేవంత్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూసీ ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. అద్భుతమైన మూసీ డవలప్ మెంట్ రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేస్తాం.. పేదవాళ్లకు అక్కడ వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతంలో పేదలు ఆక్రమించుకొని ఉన్నరు.. రూపాయిరూపాయి కూడబెట్టి గుడిసెలు వేసుకొని ఉన్నరు. వారిపట్ల ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరిస్తుంది. మూసీ నాలాలో ఉన్న శాశ్వత నివాసదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 11వేల మందికి అక్కడ ఇళ్లు ఉన్నాయి.. ప్రతివారికి డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చి వారికి ఇబ్బందిలేకుండా చూస్తామని రేవంత్ పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :