Studio18 News - తెలంగాణ / : మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని అనురాగ్ యూనివర్సిటీపై ఇరిగేషన్ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెరువును కబ్జా చేసి బఫర్ జోన్ పరిధిలో భారీ నిర్మాణం చేపట్టారంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలోని నాడెం చెరువు బఫర్ జోన్‌లో 1.5 ఎకరాల భూమిని ఆక్రమించి అనురాగ్ ఇన్ స్టిట్యూషన్స్ సంస్థ అక్రమ నిర్మాణాలు చేపట్టిందంటూ ఇరిగేషన్ శాఖ ఏఈ పరమేశ్... పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Admin
Studio18 News