Monday, 08 December 2025 03:49:49 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Babu Mohan: తిరిగి టీడీపీలోకి బాబుమోహన్ ?

Date : 26 August 2024 03:17 PM Views : 418

Studio18 News - TELANGANA / : ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన మాజీ నటుడు బాబుమోహన్ తిరిగి సొంత గూటికి చేరే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ అరంగేట్రం చేసిన తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నట్లు సమాచారం. తాజాగా హైదరాబాద్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బాబుమోహన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీలో చేరిక విషయం ప్రస్తావనకు వచ్చిందని, బాబుమోహన్ చేరిక పట్ల చంద్రబాబు సానుకూలంగా స్పందించారని పార్టీ వర్గాలు తెలిపాయి. బాబుమోహన్ త్వరలోనే పచ్చ జెండా కప్పుకోనున్నారని వెల్లడించాయి. గతంలో ఎన్టీఆర్ పై అభిమానంతో బాబుమోహన్ టీడీపీలో చేరారు. 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆందోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. సాంఘిక సంక్షేమ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత బాబుమోహన్ టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) లో చేరి 2004, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, 2018లో బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలోకి జంప్ అయ్యారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అనంతరం బీజేపీకి గుడ్ బై చెప్పి ప్రజాశాంతి పార్టీలో చేరారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై సీబీఎన్ దృష్టి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు సంకల్పించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ఆదివారం ఎన్టీఆర్ భవన్ లో ముఖ్య నాయకులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. బాబుమోహన్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో పార్టీని వీడిన వారితో చంద్రబాబు మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీడీపీలోకి ఎంతమంది తిరిగి వస్తారనే దానిపై ఊహాగానాలు జరుగుతున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :