Studio18 News - తెలంగాణ / : గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో జడ్పీ చైర్ పర్సన్ సరిత అభిమానులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవొద్దంటూ ఆందోళన చేపట్టారు. సరితా తిరుపతయ్యకు ఆ పార్టీ నాయకులు వినతిపత్రాలు అందజేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని నల్లగుంట ప్రాంతంలో సరితతిరుపతయ్య అభిమాని ప్రసాద్ ఏకంగా సెల్ టవర్ ఎక్కి నిరసన వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. ఒకవేళ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే టవర్ పైనుంచి దూకేస్తానంటూ బెరింపులకు దిగాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రసాద్ కు నచ్చజెప్పి కిందకు దింపే ప్రయత్నం చేయగా... ఈ క్రమంలో భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Also Read : RajannaSircilla : ఘనంగా దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతి వేడుకలు
ADVT
Admin
Studio18 News