Studio18 News - తెలంగాణ / : ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం రాకాశితండా గ్రామంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తదితరులు పర్యటించారు. ముంపు బాధితుల ఇంటింటికి తిరిగి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ…వర్షాలకి ప్రజలు సర్వం కోల్పోయారని, చూస్తుంటే బాధేస్తోందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆదుకుందామని, రాష్ట్ర ప్రభుత్వం వరద బాధిత సహాయక కార్యక్రమాలు వేగవంతం చేయాలని కిషన్ రెడ్డి చెప్పారు. తుపాను వస్తుందని, మరింతగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రస్తుతం దయనీయమైన పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిన తరువాత కేంద్ర బృందాలను పంపించి పంట నష్టం, పశు సంపద ప్రాణాలు కోల్పోయిన వారికి వికాస్ మేనేజ్మెంట్ కింద సహాయం చేస్తామని తెలిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కి ఎస్డీఎఫ్ నిధుల ద్వారా తాత్కాలిక సహాయం చేయాలని అన్నారు. పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి ఇవ్వాలని, బాధితులను ఆదుకుంటామని చెప్పారు. మరోవైపు, మున్నేరు వరద ముంపునకు గురై నిరాశ్రయులైన వారికి నిత్యావసర సరుకులు, దుప్పట్లను పంపిణీ చేశారు కిషన్ రెడ్డి. వరద బాధితులకు కేంద్ర సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
Admin
Studio18 News