Monday, 17 February 2025 04:56:09 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

HYDRA: హైడ్రా పేరుతో బెదిరిస్తే జైలుకే.. రంగనాథ్ హెచ్చరిక

Date : 04 September 2024 03:45 PM Views : 53

Studio18 News - TELANGANA / : ‘హైడ్రా చీఫ్ రంగనాథ్ నాకు బాగా క్లోజ్.. రూ.20 లక్షలు ఇస్తే హైడ్రా బుల్డోజర్లు మీ నిర్మాణాల జోలికి రాకుండా చూస్తా.. లేదంటే కూల్చేయిస్తా’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక కార్యకర్తనని, సామాజిక సేవకుడినని చెప్పుకుంటూ విప్లవ్ సిన్హా అనే వ్యక్తి అమీన్ పూర్ లో బిల్డర్లను బెదిరించాడు. తనకు డబ్బులు ఇవ్వకుంటే మీడియాలో మీ నిర్మాణాల గురించి అసత్యాలు రాయించి, హైడ్రాకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో బిల్డర్లు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం హైడ్రా చీఫ్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై రంగనాథ్ స్పందించారు. హైడ్రా పేరుతో కానీ, అధికారుల పేరుతో కానీ బెదిరింపులకు పాల్పడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. చెరువుల ఆక్రమణలను తొలగిస్తూ ప్రజల అభిమానం చూరగొన్న హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోబోమని చెప్పారు. హైడ్రా విభాగాన్ని నీరుగార్చేలా చేసినా, అధికారులను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. తమ పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే పోలీసులను, ఏసీబీ అధికారులను సంప్రదించాలని రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. అసలేం జరిగిందంటే.. అమీన్ పూర్ లో ఓ బిల్డర్ భారీ నిర్మాణం చేపట్టారు. అన్ని అనుమతులతో నిర్మాణ పనులు చేపట్టగా.. విప్లవ్ సిన్హా అనే వ్యక్తి ఫోన్ చేశాడని బిల్డర్ చెప్పారు. హైడ్రా మీ నిర్మాణాల జోలికి రాకూడదంటే తాను అడిగిన సొమ్ము ముట్టజెప్పాలని, రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడన్నారు. సిన్హా ఫోన్ కాల్ తో ఆందోళనకు గురైన సదరు బిల్డర్.. పిస్తా హౌస్ వద్దకు వెళ్లి సిన్హాను కలుసుకున్నారు. హైడ్రా చీఫ్ రంగనాథ్ తనకు తెలుసని, అమీన్ పూర్ లో ఏ విషయమైనా రంగనాథ్ తననే అడుగుతారంటూ సిన్హా చెప్పాడన్నారు. రంగనాథ్ తో కలిసి ఉన్న ఫొటోలను చూపించి డబ్బులు డిమాండ్ చేశాడన్నారు. దీంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని బిల్డర్ వివరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :