Saturday, 14 December 2024 07:47:52 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

KTR: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ కవితకు త్వరలోనే బెయిల్: కేటీఆర్

Date : 09 August 2024 04:23 PM Views : 87

Studio18 News - తెలంగాణ / : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు త్వరలోనే బెయిల్ రావచ్చని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. జైల్లో సౌకర్యాలు ఏమి లేవని, కవిత 11 కిలోల బరువు తగ్గారని తెలిపారు. 12 వేల మంది ఉండాల్సిన జైల్లో 30 వేల మంది ఉన్నారని చెప్పారు. ఢిల్లీలో ఇప్పటికే తాము న్యాయవాదులను కలిశామని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్‌ను విలీనం చేస్తారని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, అలాంటి సంస్థలకు లీగల్ నోటీసులు ఇస్తామని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో హైదరాబాద్‌కు తీరని నష్టం వాటిల్లిందని కేటీఆర్ అన్నారు. 2001లో చంద్రబాబు ప్రభుత్వం తొలిదశ పనులు మొదలు పెట్టిందని, హైదరాబాద్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు మొదలు పెట్టిందని తెలిపారు. దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో నీటి కోసం పోరాటం జరుగుతుందని, హైదరాబాద్‌లో మాత్రం కేసీఆర్ ముందు చూపుతో ఆ పరిస్థితి లేదని కేటీఆర్ చెప్పారు. ఈ వేసవి నాటికి హైదరాబాద్‌కు అక్కడి నుంచి నీటి తరలించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంచనా వేసిందని అన్నారు. వేసవిలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి పెంచిందని తెలిపారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సుంకిశాల ఘటన జరిగిందని కేటీఆర్ చెప్పారు. 2వ తేదీన టన జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా? తెలిసి దాచిపెట్టారా? అని అన్నారు. గతంలో మేడిగడ్డ విషయాన్ని తాము రహస్యంగా ఉంచలేదని, ప్రమాదం జరిగిన గంటల్లోనే నిర్మాణ సంస్థ స్పందించిందని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :