Studio18 News - తెలంగాణ / : "నా మాటలు గుర్తు పెట్టుకో 'చీప్' మినిస్టర్ రేవంత్... మేం అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే బాబాసాహెబ్ అంబేద్కర్, సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తాం" అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పంజాగుట్ట వద్ద రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసిన సీఎం రేవంత్ రెడ్డి... కేటీఆర్‌పై మండిపడ్డారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా స్పందించారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే అంబేడ్కర్, సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తామన్నారు. నీలాంటి ఢిల్లీ బానిస తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణను అర్థం చేసుకోలేరని విమర్శించారు. చిన్నపిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన నైజం, వ్యక్తిత్వం, ఆయన పెంపకాన్ని సూచిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చురక అంటించారు.
Admin
Studio18 News