Studio18 News - తెలంగాణ / : BRS MLA Krishna Mohan Reddy : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.. రెండు రోజుల క్రితం తిరిగి బీఆర్ ఎస్ పార్టీలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంతకాలంగా పార్టీలో అసంతృప్తితో ఉన్న ఆయన.. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కృష్ణ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. దీంతో ఆయన తిరిగి బీఆర్ఎస్ చేరినట్లు వార్తలు వచ్చాయి. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగేలా కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించినట్లు తెలిసింది. ఈ క్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ఉదయం బండ్ల కృష్ణ మోహన్ నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని ఆయన్ను మంత్రి బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా..? తిరిగి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారా అనే అంశంపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది.
Admin
Studio18 News