Studio18 News - తెలంగాణ / : రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకుంటామా అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహంపై మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తల్లి గుండెల్లో ఉండాలి కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల పెడతామని రేవంత్ రెడ్డి అన్నారని తెలిపారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే చెప్పుతో కొడతానన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందని స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ లాంటి గొప్ప వ్యక్తి గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న తీరు బాగోలేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలకు కరెక్ట్ మొగుడు రేవంత్ రెడ్డి అని, కేటీఆర్ చీప్ లిక్కర్ తాగిన మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పదేళ్లు నరకం చూపించింది కాబట్టే ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ నేతల ధైర్యం, సాహసాల ముందు కేటీఆర్ ఎంత అని అన్నారు. కేసీఆర్ చారాణ వ్యాఖ్యలు చేస్తుంటే, కేటీఆర్ బారాణ వ్యాఖ్యలు చేస్తున్నారని సెటైర్ల వేశారు. మేము సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి గులాం గిరి చేస్తామన్నది నిజమేనని తెలిపారు. సచివాలయం వద్ద రాహుల్ గాంధీ విగ్రహాన్ని కూలగొట్టాలంటే ముందు బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాదని, తాము వారిని రానియ్యమని చెప్పారు.
Admin
Studio18 News