Wednesday, 10 December 2025 01:03:08 AM
# Raashi Singh: కాలేజీ రోజుల్లో లెక్చరర్ తో ప్రేమలో పడ్డాను: హీరోయిన్ రాశీ సింగ్ # DK Shivakumar: కర్ణాటకలో మరోసారి తెరపైకి సీఎం పదవి వివాదం.. సిద్ధూ కుమారుడి వ్యాఖ్యలపై డీకే ఏమ‌న్నారంటే..! # Narendra Modi: ‘ఇండిగో’ సంక్షోభంపై స్పందించిన మోదీ.. ఏమన్నారంటే..! # Jasprit Bumrah: బుమ్రా ముందు అరుదైన రికార్డు.. ఒక్క వికెట్ తీస్తే చరిత్రే! # IND vs SA | తొలి టీ20లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా.. సంజూకు నో ఛాన్స్..! # Sonia Gandhi: సోనియాగాంధీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు # IND vs SA | మరోసారి గిల్, సూర్య ఫ్లాప్.. బౌండరీలతో చెలరేగుతున్న అభిషేక్..! # Team India Squad | శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత స్క్వాడ్‌లో అండర్ -19 వరల్డ్‌కప్ స్టార్లు..! # Nayanam Trailer | వ‌రుణ్ సందేశ్ హీరోగా జీ5 వెబ్ సిరీస్.. ఆస‌క్తిక‌రంగా ‘న‌యనం’ ట్రైల‌ర్ # Pre wedding shoot: ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. యువ జంట దుర్మరణం # Actress | ఏంటి.. ఆ హీరోయిన్ పెళ్లి కూడా ర‌ద్దైందా.. అస‌లు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ..! # UIDAI: ఆధార్ అప్‌డేట్‌ ఇక ఇంట్లోనే.. వచ్చేసింది కొత్త యాప్ # Sunaina Yella | పాపులర్ అరబ్‌ యూట్యూబర్‌తో తెలుగు హీరోయిన్‌ పెళ్లి.. క్రేజీ టాక్‌లో నిజమెంత..? # Anthony Albanese: పిల్లలకు బాల్యం చెదరనీయకుండా చేద్దాం.. సోషల్ మీడియా బ్యాన్ పై ఆస్ట్రేలియా ప్రధాని కీలక వ్యాఖ్య # Deepika Padukone | విక్కీ కౌశల్‌కు జోడీగా దీపికా పదుకొణె? ‘మహావతార్’లో పవర్ ఫుల్ రోల్! # Indian Cinema 2025 : బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ భారీ కలెక్షన్లు రాబట్టిన టాప్ సినిమాల జాబితా ఇదే # Prabhas: ప్రభాస్ పర్యటన వేళ జపాన్ లో భూకంపం.. అభిమానుల్లో ఆందోళన.. మారుతి స్పందన # Akhanda 2 | ‘అఖండ 2’ రాకతో చిన్న సినిమాలకు షాక్ .. విడుదల తేదీల్లో పెద్ద గందరగోళం # Vijay: తమిళనాడుకే పరిమితం కాదు.. పుదుచ్చేరి ప్రజలకు కూడా అండగా ఉంటా: విజయ్ # Varanasi | మహేష్ బాబుకి జక్కన్న టార్చర్ స్టార్ట్… ‘వారణాసి’ కోసం ఏకంగా 5 గెటప్స్!

Jitta Balakrishna Reddy: జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి దిగ్భ్రాంతిని కలిగించింది: రేవంత్ రెడ్డి, కేటీఆర్

Date : 06 September 2024 03:38 PM Views : 394

Studio18 News - TELANGANA / : తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మరణం తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జిట్టా మృతిపై ఆయన ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. జిట్టా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జిట్టా అకాల మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. జిట్టా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం బీఆర్ఎస్‌కు తీరని లోటు అన్నారు. సొంత ఆస్తులను కూడా లెక్కచేయకుండా తెలంగాణ ఉద్యమ నిర్మాణానికి ఎంతో కృషి చేశారన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం అనేక పోరాటాల్లో కలిసి పని చేశామని హరీశ్ రావు గుర్తు చేసుకున్నారు. భువనగిరి ప్రాంత ప్రజల కోసం ఆయన ఎంతో తపన పడేవారన్నారు. బీఆర్ఎస్ యువజన విభాగం పటిష్టానికి ఆయన ఎంతో కృషి చేశారని వెల్లడించారు. జిట్టా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి (52) కొన్నాళ్లుగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :