Studio18 News - తెలంగాణ / : Special Focus : డ్రోన్ అటాక్. డ్రోన్ రెస్క్యూ..డ్రోన్‌తో స్మగ్లింగ్..సాయమైనా..దాడికైనా..అక్రమ దందాకైనా టెక్నాలజీనే ఇంపార్టెంట్ అయిపోయింది. గడపదాటి బయటికి వెళ్లలేం. అలా అని ఆకలితో చావలేమని వరద బాధితులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్న సమయాల్లో ఆపద్బాంధవిగా మారుతోంది డ్రోన్. వరదలు, విపత్తుల సమయంలో నేనున్నానంటూ తలుపు తడుతోంది. అంతేకాదు ఇండియా, పాక్ బార్డర్‌లో కేటుగాళ్లు డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేందుకు కూడా డ్రోన్‌ను వాడుతున్నారు. వ్యవసాయ పంటలకు మందులు స్ప్రే చేయడంలో డ్రోన్ విప్లవాత్మక మార్పు అయిపోయింది. ఊహించని విపత్తు వచ్చినా..నిందితులను పట్టుకోవడానికి అయినా డ్రోన్ తప్పనిసరైపోయింది. మంచికి చెడుకు అన్నింటికీ డ్రోన్ కేరాఫ్ అయిపోయింది. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ డ్రోన్లు యుద్ధతంత్రాన్నే మార్చేశాయి. ఆకాశమే యుద్ధభూమిగా..పశ్చిమాసియా దేశాలు హైస్పీడ్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో కూడిన డ్రోన్లతో అటాక్ చేసుకుంటున్నాయి. ప్రతీ రంగంలో డ్రోన్స్ కీలకం అయిపోయాయి. భారత్, పాక్ బార్డర్‌లో అయితే రోజుకో కవ్వింపు జరుగుతోంది. అందులో డ్రోన్ అనుమానాస్పదంగా తిరగడం రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంటుంది. డ్రోన్ల ద్వారా డ్రగ్స్ సప్లైతో పాటు..అటెన్షన్ డైవర్షన్ కోసం డ్రోన్లు ఎగరవేస్తుంది పాకిస్థాన్. BSF జవాన్లు ఎప్పటికప్పుడు ఆ డ్రోన్లను కూల్చివేస్తున్నారు. ఒకప్పుడు అత్యవసరం అయితే తప్ప హెలికాప్టర్లు వాడలేని పరిస్థితి. అయితే హెలికాప్టర్లు అన్నిచోట్లకు వెళ్లలేవు. డ్రోన్లు అలా కాదు. ఎలాంటి సిచ్యువేషన్‌లో అయినా డెస్టినేషన్‌కు వెళ్లి..తిరిగి రిటర్న్ టు హోమ్‌కు వచ్చేస్తాయి. అందుకే ఇప్పుడు డ్రోన్ల వాడకం చాలా సింపుల్ అయిపోయింది. పిట్ట కొంచెం కూతం ఘనం అన్నట్లుగా..చూడటానికి చిన్న సైజ్‌లో ఉన్నా..పెద్దసాయమే చేస్తుంది డ్రోన్. మనిషికి తోడుగా.. చేదోడుగా డ్రోన్ : విజయవాడ, ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో ఫుడ్ సప్లై చేస్తున్నారు. హెలికాప్టర్లు, పడవలు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో సాయం అందించారు. భీమవరంకు చెందిన ఓ రైతు పొలాల్లో మందులు పిచికారీ చేసే డ్రోన్‌తో..విజయవాడ జనాలకు ఆహారాన్ని అందజేశారు. సింగ్ నగర్, జక్కంపూడి, వాంబే కాలనీ ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి డ్రోన్లతో పాలు, బిస్కెట్లు, ఫుడ్ ఐటమ్స్ అందిస్తున్నారు. విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో చేపట్టిన సహాయక చర్యలపై ప్రశంసలు వస్తున్నాయి. 30 డ్రోన్లతో సాయం అందిస్తున్నారు. మరో 200 డ్రోన్లను ఫీల్డ్‌లోకి దించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో డ్రోన్‌తో 8 నుంచి 10 కిలోల సరుకులను పంపే అవకాశం ఉంటుంది. డ్రోన్‌కు తాడుతో ఓ బుట్టను కట్టి..అందులో ఆహార పదార్థాలను వరద బాధితుల కోసం పంపారు. ఈ డ్రోన్లు నాలుగు కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలుగుతాయి. దారిలో విద్యుత్ తీగలు, నిర్మాణాలు అడ్డొస్తే తప్పుకొనేందుకు వీలుగా..ఈ డ్రోన్లకు క్రాష్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఉంది. ఈ డ్రోన్లకు ఉన్న బ్యాటరీ 20 నిమిషాలు పనిచేస్తుంది. వరద బాధితులకు ఆహారాన్ని అందించగానే హోమ్ బటన్ నొక్కితే నేరుగా వెనక్కు వచ్చేస్తుంది. పంటలకు డ్రోన్లతో మందుల పిచికారి : విజయవాడలోని కొన్ని వరద ప్రభావిత ప్రాంతాల్లోకి పడవలు వెళ్లలేని పరిస్థితి. అజిత్‌సింగ్ నగర్, వాంబే కాలనీ, అరుణోదయ నగర్, జక్కంపూడి కాలనీ పరిధిలో ఉన్న చాలా వీధుల్లో వేలమందికి ఆకలి బాధలు తప్పలేదు. వాళ్లందరికి హెలికాప్టర్లతో ఆహారం పంపాలన్నా..చుట్టూ ఉన్న విద్యుత్ తీగల కారణంగా సాధ్యం కాలేదు. వెంటనే ప్రభుత్వానికి ఈ సరికొత్త ఆలోచన వచ్చి 30 డ్రోన్లను వినియోగించింది. భవనాలు, అపార్టుమెంట్ల పైభాగంలో ఉన్న బాధితులకూ డ్రోన్ల ద్వారా ఫుడ్ సప్లై చేశారు. డ్రోన్ల సాయంతో గత రెండు రోజుల్లో వేల మందికి ఆహారం పంపారు. విజయవాడలో ఎవరైనా లొకేషన్ షేర్ చేస్తే డ్రోన్లు ఆ ప్రాంతానికి వెళ్లి ఆహారాన్ని అందిస్తున్నాయి. మనరాష్ట్రంలో వ్యవసాయంలో రైతులకు శ్రమ తగ్గించి, పంటల్లో దిగుబడి పెంచేలా ఎరువులు, పురుగు మందులు స్ర్పే చేసేందుకు పలు జిల్లాలో ప్రత్యేక డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇదే తరహాలో డ్రోన్ వ్యవస్థను మరింత డెవలప్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Admin
Studio18 News