Monday, 08 December 2025 03:58:18 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

అందుకే మావోయిస్టులు మా అక్కను చంపారు: బంటి రాధ తమ్ముడు సంచలన వ్యాఖ్యలు

Date : 22 August 2024 05:18 PM Views : 287

Studio18 News - TELANGANA / : Neelso alias Banti Radha: తన అక్కను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని మావోయిస్టు బంటి రాధ సోదరుడు సూర్యం వాపోయారు. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన బంటి రాధ మృతదేహాన్ని పోలీసులు గురువారం హైదరాబాద్ కాప్రాలోని కుటుంబ సభ్యులకు అప్పగించారు.దళంలోంచి బయటకు వస్తానని చెప్పినందుకే తన సోదరిని మావోయిస్టులు చంపేశారని ఆరోపించారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మావోయిస్టుల సమాచారం తన ద్వారా పోలీసులకు రాధ ఇచ్చిందనే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ”మా అక్కను 2017లో మావోయిస్టు మద్దతుదారులు ఇంటి నుంచి తీసుకుని వెళ్లారు. దళంలోకి వెళ్లిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా మా దగ్గరకి రాలేదు. గజ్జె కట్టడం, పాటలు పాడడం దళ సభ్యులే ఆమెకు నేర్పారు. ఆమె దళంలోకి వెళ్ళాక మేము మిస్సింగ్ కేసు కూడా పెట్టాం. మా అక్క నా ద్వారా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందనడంలో ఎటువంటి వాస్తవం లేదు. NIA దాడుల తరువాత రాధ గురించి మరింత ప్రచారం జరిగింది. దళంలో బాగా పనిచేయడంతో వివిధ క్యాడర్స్ లో నియమించారు. ఇటీవల రాధ దళాన్ని వదిలి ఇంటికి వచ్చే ఆలోచన చేసింది. ఇంటికి వెళ్తానడంతో పాటు దళితురాలనే చిన్న చూపుతోనే మా అక్కను హత్య చేశారు. మా అక్కను చంపడానికి నన్ను కారణంగా చూపారు. మా అక్క నాకు మావోయిస్టు కదలికల సమాచారం ఇస్తుందనేది ముమ్మాటికీ అవాస్తవం. అసలు పోస్ట్ మార్టం సమయంలో కనీసం మాకు సమాచారం ఇవ్వలేదు. మా కుటుంబానికి న్యాయం చేసి.. మరొకరికి ఇలా జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల”ని సూర్య అన్నారు. కోవర్టుగా వ్యవహరిస్తుందనే… తెలంగాణ, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ పోలీసులకు కోవర్టుగా వ్యవహరిస్తుందనే ఆరోపణలతో బంటి (పల్లెపాటి) రాధ అలియాస్ నీల్సోను మావోయిస్టులు హత్య చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం వద్ద ఆమెను హతమార్చినట్టు ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ పేరిట మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. 2017లో ఏవోబీ మావోయిస్టు పార్టీలో చేరిన రాధ సంవత్సర కాలంలోనే సెంట్రల్ ప్రొటెక్షన్ కమిటీ ఆర్మీ కమాండర్ గా ఎదిగింది. అయితే 3 నెలల క్రితం నుంచి ఆమెపై మావోయిస్టు పార్టీకి అనుమానం కలగడంతో కీలక బాధ్యతల నుంచి తప్పించి నిఘా పెట్టింది. తన తమ్ముడు సూర్యం ద్వారా పోలీసులకు సమాచారం అందిస్తుందన్న ఆరోపణలతో ఆమెకు మరణశిక్ష అమలు చేసింది. కాగా, మావోయిస్టుల చర్యతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :