Studio18 News - తెలంగాణ / : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంలో మాట్లాడిన తీరు జుగుప్సాకరంగా ఉందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. ఆయన భాష తెలంగాణ ప్రజలు సిగ్గుపడేలా ఉందని, సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభానికి వెళ్లి అటువంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని నిలదీశారు. రైతులకు లాభం జరగాలని కేసీఆర్ ఆ ప్రాజెక్ట్ నిర్మించారని తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. ఆ ప్రాజెక్ట్ ప్రారంభానికి వెళ్లి రైతులను ఉద్దేశించి మాట్లాడాలని, అంతేగానీ, రేవంత్ రెడ్డి సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారని చెప్పారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఉద్యమాన్ని నడిపి, 60 లక్షల సభ్యత్వం ఉన్న పార్టీని నడుపుతున్న కేసీఆర్, హరీశ్ రావును ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని తక్కెళ్లపల్లి రవీందర్ రావు చెప్పారు. ఇచ్చిన హామీలు, రెండు లక్షల ఉద్యోగాలు, రెండు లక్షల రుణం మాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్ రావు అన్నారు. మరి ఆ హామీలను అమలు చేశారా అని నిలదీశారు. వాటిని అమలు చేయకపోగా ఇష్టానుసారంగా హరీశ్ రావును తిడుతున్నారని చెప్పారు.
Admin
Studio18 News