Thursday, 22 May 2025 04:14:59 PM
# నటి అనసూయ ఇంట్లో మరో వేడుక # 53 లక్షల చ.అ. విస్తీర్ణంతో సచివాలయం అవసరమా?: జగన్ # కారు వెనుక నక్కి సల్మాన్ ఖాన్ ఇంట్లోకి దూరే యత్నం.. వ్యక్తి అరెస్టు # రేషన్ కార్డుకు పెళ్లి సర్టిఫికెట్ కావాలా.. మంత్రి నాదెండ్ల ఏం చెబుతున్నారంటే...! # ఛత్తీస్‌గఢ్‌లో మళ్ళీ ఎన్‌కౌంటర్: బీజాపూర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతం # ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్, హరీశ్ కీలక మంతనాలు! # ఒకే నెలలో 50 వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్ ఇస్తున్న ప్రముఖ టెక్ సంస్థ # కుప్పకూలిన మార్కెట్లు: సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్, నిఫ్టీ 24,550 దిగువకు! # చంద్రబాబు ఏడాది పాలనపై జగన్ సంచలన ఆరోపణలు # రూ.15 వేల విలువైన పాక్ డ్రోన్లపైకి రూ.15 లక్షల విలువైన క్షిపణులా..? # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎస్ఐబీ మాజీ చీఫ్‌కు కోర్టు అల్టిమేటం # ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్! # కిమ్ చూస్తుండగానే... ఉత్తర కొరియా కొత్త యుద్ధనౌకకు ప్రమాదం! # పాక్ గూఢచర్యం కేసు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై పోలీసుల కీలక ప్రకటన # 'ఇద్దరు పెళ్లాలు' అంటూ బాలికను వేధిస్తున్న కీచక టీచర్ # ఏపీ మద్యం కుంభకోణం కేసు.. ఆ ఐదుగురూ విదేశాలకు పరార్! # హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ ను ఖతం చేశాం: ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు # పెళ్లి కావడం లేదని ప్రాణం తీసుకున్నాడు! # లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు?

KTR: సీఎం ఛాంబర్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన... కేటీఆర్, హరీశ్ రావు అరెస్ట్!

Date : 01 August 2024 04:59 PM Views : 159

Studio18 News - TELANGANA / : తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఛాంబర్ ఎంట్రన్స్ వద్ద ఆందోళన చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిన్న సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వారు సీఎం ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. సబితకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ సహా ఎమ్మెల్యేలను అసెంబ్లీ మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకువచ్చారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి... బీఆర్ఎస్ భవన్ వైపు తీసుకువెళ్లారు. పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. మహిళా శాసనసభ్యుల పట్ల అనుచితంగా, అగౌరవంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యే పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ఈ రోజు నిరసన తెలుపుతున్న తమను అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :