Sunday, 08 March 2026 03:36:33 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Woman Escape: గూడ్స్ ట్రైన్ కింద పడ్డా ప్రాణాలతో బయటపడ్డ మహిళ..

Date : 26 August 2024 11:46 AM Views : 580

Studio18 News - TELANGANA / : ఓవైపు రైలు వస్తుండగా పట్టాలు దాటే ప్రయత్నం చేసిందో మహిళ.. రైలు వచ్చేస్తోందనే కంగారులో పట్టు తప్పి పట్టాలపై పడిపోయింది. ఇంతలో ట్రైన్ దగ్గరికి రావడంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి అలాగే కదలకుండా పడుకుండిపోయింది. దీంతో ట్రైన్ ఆమె పై నుంచి పోయినా ప్రాణాలు కాపాడుకోగలిగింది. ఇదంతా రైల్వే స్టేషన్ లో ఉన్న ఇతర ప్రయాణికులు తమ సెల్ ఫోన్ కెమెరాలలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నావంద్గి రైల్వే స్టేషన్ లో ఆదివారం చోటుచేసుకుందీ ఘటన. ప్రత్యక్ష సాక్షులు, రైల్వే సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాకు చెందిన ఇద్దరు గిరిజన మహిళలు నావంద్గి రైల్వే స్టేషన్ లో పట్టాలు దాటి అవతలివైపు ఉన్న ప్లాట్ ఫాం పైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. గూడ్స్ ట్రైన్ నెమ్మదిగా వస్తుండడం చూసి హడావుడిగా దాటుతున్నారు. ఓ మహిళ పట్టాలు దాటగా.. మరో మహిళ మాత్రం పట్టాల మధ్యలో పడిపోయింది. దీంతో కొన్ని సెకండ్ల పాటు అలాగే రాళ్లపైన అతుక్కుపోయినట్లు కదలకుండా ఉండిపోయింది. మధ్యలో ఒకసారి తల ఎత్తి చూసేందుకు ప్రయత్నించగా.. కెమెరాలో అదంతా రికార్డు చేస్తున్న వ్యక్తి హెచ్చరించడం వీడియోలో వినిపించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :