Saturday, 14 December 2024 03:19:16 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

G. Kishan Reddy: రేవంత్ రెడ్డి పాలనలాగే కేసీఆర్ పాలన సాగుతోంది: కిషన్ రెడ్డి

Date : 21 August 2024 04:04 PM Views : 46

Studio18 News - తెలంగాణ / : రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ పాలనలాగే సాగుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం సికింద్రాబాద్‌లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ నేతలు చెప్పినట్లుగా రైతులకు రుణమాఫీ కాలేదని విమర్శించారు. ఎన్నికల హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. రుణమాఫీని సీఎం అంతా గందరగోళంగా మార్చివేశారన్నారు. దేవుళ్లపై ఒట్లు వేసి మరీ మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కనీసం సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదన్నారు. రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసే వరకు ప్రజలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. వ్యక్తులు, కుటుంబాల కోసం నడిచే పార్టీ బీజేపీ కాదన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమన్నారు. బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలే కోరుకుంటున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ ముక్తి దివస్‌గా ఘనంగా నిర్వహిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల స్ఫూర్తితో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కుటుంబాల కోసం అవీనితికి పాల్పడుతున్న పార్టీలను తరిమి కొట్టాలన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :