Studio18 News - తెలంగాణ / : ఖైరతాబాద్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత దానం నాగేందర్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఆక్రమణదారులను కావాలని రెచ్చగొట్టారనే ఆరోపణలపై ఆయన మీద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గత శనివారం జూబ్లీహిల్స్ డివిజన్‌లోని నందగిరిహిల్స్ గురుబ్రహ్మనగర్‌లో స్థానికులను రెచ్చగొట్టారని, దీంతో వారు... ఆయన సమక్షంలోనే పార్క్ గోడను కూలగొట్టారని జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీంతో దానంతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Admin
Studio18 News