Monday, 08 December 2025 03:23:07 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Yennam Srinivas Reddy: కేసీఆర్ ఇష్టంలేని పెళ్లి కొడుకులా అసెంబ్లీలో కూర్చున్నారు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Date : 25 July 2024 04:04 PM Views : 320

Studio18 News - TELANGANA / : ఇన్నాళ్లకు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ ఇష్టంలేని పెళ్లి కొడుకులా సభలో కూర్చున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... మీడియా పాయింట్‌ను బహిష్కరించిన కేసీఆరే... ఇప్పుడు అక్కడకు వచ్చి మాట్లాడారన్నారు. బడ్జెట్ బాగుందని, కానీ కేసీఆర్ చూడకుండానే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బడ్జెట్ అంకెలను చూడలేదని... చదవకుండా ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలకు రూ.11 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని... కానీ తాము ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు చెప్పారు. రైతు సంక్షేమానికి పెద్దపీట: కూనంనేని సాంబశివరావు కష్టకాలంలో, సంక్షోభ సమయంలో ఇలాంటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం సాహసోపేత నిర్ణయమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రైతు సంక్షేమానికి పెద్ద పీట వేశారన్నారు. విద్య, వైద్య రంగానికి సరైన కేటాయింపులు జరగలేదని విమర్శించారు. భవిష్యత్తులో అయినా విద్య, వైద్య రంగాలకు నిధులు కేటాయించాలన్నారు. అసంఘటిత కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రస్తుత సంక్షోభానికి గత ప్రభుత్వం చేసిన అప్పులే కారణమని విమర్శించారు. మంచి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :