Studio18 News - తెలంగాణ / : కళలకు నిలయమై, కళాకారులు, సాహిత్యకారులకు ప్రీతిపాత్రమైన హైదరాబాద్‌లోని త్యాగరాయ గానసభలో వేదిక అందుబాటులోకి వచ్చింది. సంగీత ఉత్సవాలకు, ఉచిత సంగీత, నాట్య తరగతుల కోసం దీనిని ప్రారంభించారు. కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడు కళా జనార్దనమూర్తి పరవేక్షలో ఈ ఏడో ఆడిటోరియంను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కేవీ రమణాచారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనిని ప్రారంభించడం శుభపరిణామమని పేర్కొన్నారు. అంతకుముందు ప్రముఖ రచయిత, ఏపీ దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధికారిక మాసపత్రిక ' ఆరాధన ' పూర్వ సంపాదకుడు పురాణపండ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏడు కొండలవాడి దయతోనే జనార్దనమూర్తికి ఇది సాకారమైందని పేర్కొన్నారు. సంగీత, నాట్య రంగంలో కొత్త తరాల శిక్షణ కోసం శ్రమించి, పరిశ్రమించి మరీ ఈ ఆడిటోరియంను నిర్మించడం గొప్ప విషయమని ప్రశంసించారు. ప్రముఖ పాత్రికేయుడు శంకరనారాయణ, త్యాగరాయగాన సభ కమిటీ సభ్యులు చక్రపాణి ప్రసాద్, పద్మజ నీలిమ , గీత, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
Studio18 News