Studio18 News - తెలంగాణ / : దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆదివారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఈ స్మగ్లింగ్ బయటపడింది. బూట్లలో, బ్యాగులో రహస్యంగా దాచి తెచ్చిన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం 1,390 గ్రాములు ఉందని, బహిరంగ మార్కెట్ లో దీని విలువ సుమారు రూ. కోటి పైనే ఉంటుందని తెలిపారు. డిఆర్ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండయిన ఎమిరేట్స్ విమానంలో ఓ ప్రయాణికుడు బంగారం అక్రమంగా తీసుకొచ్చాడు. తనిఖీలలో బంగారం బయటపడడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 1,00,06,909 విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బంగారం తీసుకొచ్చిన ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Admin
Studio18 News