Friday, 18 July 2025 07:20:26 AM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

దమ్ముంటే.. గన్‌మెన్ లేకుండా అశోక్ నగర్, ఓయూకి రావాలి- సీఎం రేవంత్ కి హరీశ్ సవాల్

Date : 03 August 2024 10:29 AM Views : 172

Studio18 News - TELANGANA / : Harish Rao Challenge : తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. జాబ్ క్యాలెండర్ ఒక జోక్ క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు. విద్యార్థులను కాంగ్రెస్ పార్టీ దగా చేసిందని ఆరోపించారాయన. ”అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. నిరుద్యోగ యువతకు బస్సులు పెట్టి గ్రామాలు తిప్పి ప్రచారం చేసుకున్నారు. గద్దెనెక్కాక విద్యార్థులను మరిచిపోయారు. మొదటి క్యాబినెట్ లోనే జాబ్ క్యాలెండర్ అన్నారు. 8 నెలల తర్వాత ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లో ఏమైనా ఉన్నదా? అసెంబ్లీలో స్టేట్ మెంట్ ఇస్తే ఎవరు ఇచ్చారు? అనేది ఉంటుంది. పేరు లేదు, సంతకం లేదు, ఒక చిత్తు కాగితం లాగా ప్రకటించారు. చర్చ కూడా లేకుండా ఉప ముఖ్యమంత్రి గారు చదివి పారిపోయారు. లక్షలాది మంది యువతీ యువకుల కంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటుందా? చర్చ చేయమంటే ఎందుకు పారిపోయారు? దమ్ముంటే మాట్లాడాలి కదా? దానం నాగేందర్ కు మైక్ ఇచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు. మీకు మాట్లాడే ముఖం లేదు. మిమ్మల్ని వదిలి పెట్టం. నిరుద్యోగుల తరుపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. అభయ హస్తం మ్యానిఫెస్టోలో చెప్పినవి ఒక్కటీ అమలు చేయలేదు. రెండు లక్షల ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. రేవంత్ రెడ్డి గన్ మెన్ లేకుండా అశోక్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీకి రండి. మీరు ఉద్యోగాలు ఇచ్చింది నిజమే అయితే దమ్ముంటే రావాలి. ఏ టైమ్ చెబుతారో, డేట్ చెబుతారో వస్తా. రావడానికి మీరు భయపడుతున్నారు. ఎన్ని రోజులు దాక్కుంటారు. ఎన్ని రోజులు తప్పించుకుంటారు? యువతకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీ నీ క్రెడిబులిటీ ఏంటి. నువ్వు రా సమాధానం చెప్పు లేకుంటే నిరుద్యోగ యువతతో ఏఐసీసీ కార్యాలయానికి వస్తాం. అక్కడికి వచ్చి నిలదీస్తాం. హామీలు ఇచ్చి వెళ్లిపోయావు. ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వడం లేదు. ప్రజా ప్రభుత్వంలో అన్నీ ఆంక్షలే. అడిగితే కేసులు. ఉద్యోగాల గురించి అడిగితే కేసులు పెడతారా. ట్రోలింగ్ చేస్తారా? తెలంగాణ నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ దగా చేసింది. శాసనసభ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే. శాసనసభ కౌరవ సభగా మారింది. మహిళలు, రైతులు, విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. గద్దెనెక్కినంక దగా చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ఉద్యమాల గడ్డ. దబాయింపులకు తావు లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దాకా కాంగ్రెస్ పార్టీ వెంటబడతాం. మేము ఇచ్చిన నోటిఫికేషన్లకే నియామకపత్రాలు ఇచ్చారు. మీ ప్రభుత్వం వచ్చాక ఒక్క నోటిఫికేషన్ ఇచ్చారా? దమ్ముంటే సమాధానం చెప్పండి” అంటూ విరుచుకుపడ్డారు హరీశ్ రావు. ఉద్యోగాల విషయంలో అశోక్ నగర్ లో చర్చకు సిద్ధం- కేటీఆర్ జాబ్ క్యాలెండర్, దానం నాగేందర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బోగస్ జాబ్ క్యాలెండర్ తో నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. క్యాలెండర్ లో డేట్ లు మారుతున్నాయి కానీ జాబ్ లు మాత్రం రావడం లేదన్నారు కేటీఆర్. మీరు ఇచ్చిన 2లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని.. రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేటీఆర్. అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ఉద్యోగాల గురించి మాట్లాడితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల విషయంలో అశోక్ నగర్ లో చర్చకు సిద్ధం అని కేటీఆర్ సవాల్ విసిరారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :