Studio18 News - తెలంగాణ / : Bail Granted To MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత గత ఐదు నెలలుగా తీహార్ జైల్లో ఉంటున్నారు. తాజాగా ఆమెకు భారీ ఊరట లభించింది. కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించగా.. ఈడీ, సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఎస్వీ రాజు, డిపి సింగ్ వాదనలు వినిపించారు. సుమారు గంటన్నర పాటు కోర్టులో వాదనలు కొనసాగాయి. సెక్షన్ 45 ప్రకారం కవిత బెయిల్ కు అర్హురాలని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. రూ. 10లక్షల పూచీకత్తుతో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పాస్ పోర్టును కోర్టుకు సరెండర్ చేయాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు విచారణకు సహకరించాలని బెయిల్ మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు సూచించింది. దాదాపు 165 రోజుల తరువాత కవిత బెయిల్ మంజూరు జైలు నుంచి బయటకు రాబోతున్నారు. కవిత కేసు డైరీ.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అంతకు ముందు పది రోజుల ముందు ఈడీ నోటీసులు ఇవ్వగా.. కవిత హాజరు కాలేదు. 2022 జులైలో లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దాదాపు ఐదు నెలల తరువాత మొదటిసారిగా కవితను సీబీఐ విచారించింది. 2022 డిసెంబర్ 11న కవితను ఆమె ఇంట్లోనే సీబీఐ విచారించింది. లిక్కర్ స్కాం లో సీఆర్పీసీ 160 కింద ఏడు గంటల పాటు వాంగ్మూలంను సీబీఐ నమోదు చేసింది. 2023 మార్చి 11న మొట్టమొదటిసారిగా ఈడీ కవితను విచారించింది. ఆ తరువాత 16, 20, 21న ఢిల్లీలో కవితను ఈడీ విచారించింది. తన ఎనిమిది ఫోన్లని కవిత ఈడీ అధికారులకు అందజేసింది. ఈడీ, సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కవిత పేరు ప్రస్తావన. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ 50 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడీ అధికారులు. 2024 జనవరి 5న కవితకు మళ్ళీ ఈడీ నోటీసులు. మహిళను వ్యక్తిగతంగా విచారణకు పిలవడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కవిత. ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ లో ఫిబ్రవరి 21న కవితకు సీబీఐ నోటీసులు. ఫిబ్రవరి 26న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్న సీబీఐ. తొలిసారిగా కవితను నిందితురాలుగా చేర్చిన సీబీఐ. సుప్రీం కోర్టులో కేసు విచారణ ఉంది.. నేను రాలేను అని రిప్లై ఇచ్చిన కవిత. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కవిత మార్చి 15న అరెస్ట్ అయ్యారు. రెండు దఫాలుగా 10 రోజుల ఈడీ కస్టడీ అనంతరం మార్చి 26న రౌస్ అవెన్యూ కోర్టు కవితకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది. 14రోజులకు ఒకసారి కవిత జ్యూడీషియల్ కస్టడీని రెండు సార్లు కోర్టు పొడిగించింది. తీహార్ జైల్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11న కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. మూడు రోజుల సీబీఐ కస్టడీ అనంతరం సీబీఐ కేసులోనూ కవితకు జ్యూడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు విధించింది. సీబీఐ కేసులో కవిత జ్యూడీషియల్ కస్టడీని మే20 వరకు కోర్టు పొడిగించింది. జులై8న కవిత డిఫాల్ట్ బెయిల్ పై విచారణ వాయిదా పడింది. జులై 1న లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్ నిరాకరించింది ఢిల్లీ హైకోర్టు. కవిత బెయిల్ పిటిషన్లు కోర్టు కొట్టివేసింది. జులై 16న కవితకు అస్వస్థత కారణంగా తీహార్ జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు. జులై 18న కవిత కేసు విచారణ వాయిదా పడింది. ఆగస్టు 12న కవితకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర బెయిల్ కల్పించలేమని సుప్రీంకోర్టు తెలిపింది.. ఆగస్టు 20కి విచారణ వాయిదా వేసింది. ఆగస్టు 14న సెప్టెంబర్ 2 వరకు కస్టడీ పొడిగించిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఆగస్టు 20న సుప్రీంకోర్టులో మరోసారి వాయిదాపడిన కేసు విచారణ. ఆగస్టు 27న కవితకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
Admin
Studio18 News