Saturday, 14 December 2024 04:43:34 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Revanth Reddy: కవితకు బెయిల్‌పై వ్యాఖ్య.. రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

Date : 29 August 2024 05:03 PM Views : 38

Studio18 News - తెలంగాణ / : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఓటుకు నోటు కేసుపై విచారణ సందర్భంగా పిటిషనర్ జగదీశ్ రెడ్డి తరఫున ఆయన న్యాయవాది వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ తీర్పుపై చేసిన వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. బీజేపీ, బీఆర్ఎస్ మ‌ధ్య ఒప్పందం వ‌ల్లే, క‌విత‌కు బెయిల్ వ‌చ్చింద‌ని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. దీనిని సుప్రీంకోర్టు సీరియ‌స్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తి ఇలా మాట్లాడటమా? అని ప్ర‌శ్నించింది. జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌... ముఖ్యమంత్రి వ్యాఖ్యలను త‌ప్పుబ‌ట్టింది. సీఎం చేసిన వ్యాఖ్య‌లు.. ప్ర‌జ‌ల మెద‌ళ్ల‌లో అనుమానాల‌కు తావిస్తుందన్నారు. తమ ఆదేశాల‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చినా తామేమీ బాధ‌ప‌డ‌మ‌ని, కానీ తాము త‌మ అంత‌రాత్మ ప్ర‌కార‌మే విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంటామ‌ని పేర్కొంది. సీఎం అంటే బాధ్యతగా ఉండాలని, ఇలా మాట్లాడటం సరికాదని పేర్కొంది. కోర్టు తీర్పులను రాజకీయాల్లోకి లాగడం మంచిది కాదని పేర్కొంది. "రాజ‌కీయ నాయ‌కుల‌ను సంప్ర‌దించి మేం ఆదేశాలు ఇస్తామా? ఎవ‌రి వ్యాఖ్య‌లనూ ప‌ట్టించుకోం.. మా విధిని నిర్వ‌హిస్తాం... ప్ర‌మాణ పూర్వ‌కంగా ప‌ని చేస్తాం. ఎవ‌రి ప‌నుల్లోనూ జోక్యం చేసుకోం. స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం అంటే గౌర‌వం లేదా? వ్య‌వ‌స్థ‌ల ప‌ట్ల గౌరవం ఉండాలి. ఇలాంటి ప్ర‌వ‌ర్త‌న ఉంటే ఓటుకు నోటు విచార‌ణ రాష్ట్రం బ‌య‌టే నిర్వ‌హిద్దాం" అని జ‌స్టిస్ గ‌వాయ్ ధ‌ర్మాస‌నం తీవ్రంగా వ్యాఖ్యానించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :