Studio18 News - TELANGANA / : ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ దివ్యాంగులను అవమానించారని, ఆమెను వెంటనే తొలగించాలని, అరెస్ట్ కూడా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక హైదరాబాదులో నిరసన కార్యక్రమం నిర్వహించింది. లోయర్ ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జాతీయ అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. స్మితా సబర్వాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్మితా సబర్వాల్‌కు నోటీసులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే తాము పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.
Admin
Studio18 News