Friday, 14 February 2025 07:54:40 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

HYDRAA: వేటిని కూల్చివేస్తున్నామంటే... స్పష్టత ఇచ్చిన 'హైడ్రా' కమిషనర్ రంగనాథ్

Date : 08 September 2024 04:47 PM Views : 69

Studio18 News - TELANGANA / : ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా... ఇవాళ కూడా పలు కూల్చివేతలతో ప్రకంపనలు సృష్టించింది. ఈ క్రమంలో, కూల్చివేతలకు సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరింత స్పష్టత ఇచ్చారు. నిబంధలనకు విరుద్ధంగా ఉండి, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కట్టడాలను మాత్రమే కూల్చివేస్తున్నట్టు వెల్లడించారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో ఉన్నప్పటికీ... ఆయా నిర్మాణాల్లో ఎవరైనా నివాసం ఉంటే ఆ నిర్మాణాలను కూల్చడంలేదని స్పష్టం చేశారు. ఆ మేరకు ప్రజలకు హామీ ఇస్తున్నామని తెలిపారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉంటున్న స్థలాలను, ఇళ్లను కొనుగోలు చేయవద్దని ప్రజలకు సూచించారు. మల్లంపేట చెరువు బఫర్ జోన్ లో ఉన్న కట్టడాలు నిర్మాణ దశలో ఉన్నాయని, అందుకే వాటిని కూల్చివేస్తున్నామని రంగనాథ్ వివరించారు. ఇక సున్నం చెరువులో వాణిజ్యపరమైన నిర్మాణాల కూల్చివేతలపై స్పందిస్తూ... గతంలోనే ఇక్కడి షెడ్లను కూల్చివేసినప్పటికీ మళ్లీ నిర్మిస్తున్నారని, అందుకే వాటిని కూల్చివేస్తున్నామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని భూపాల్ రెడ్డి, బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :