Studio18 News - తెలంగాణ / : మీరు (అధికార కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి) బూతులు తిట్టినా... అవమానించినా ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తూనే ఉంటాం... నిలదీస్తూ ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పోరాటం తమకు కొత్తేమీ కాదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఒక ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఆ తర్వాత మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ యువతను మోసం చేస్తున్న ఈ విధానం మీద అవసరమైతే ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఎండగడుతామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలిపెట్టేది లేదని, తమను తిట్టినా ప్రశ్నిస్తుంటామనీ, నిలదీస్తామనీ అన్నారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తన అరెస్టుకు సంబంధించిన ఫొటోను కేటీఆర్ షేర్ చేశారు.
Admin
Studio18 News