Saturday, 14 December 2024 04:15:13 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

ఊరిస్తున్న పదవులు.. దక్కని గుర్తింపు.. ప్రొఫెసర్‌ కోదండరాంకి చివరికి మిగిలిందేంటి?

Date : 30 July 2024 01:29 PM Views : 42

Studio18 News - తెలంగాణ / : Gossip Garage : నేను సైతం అంటూ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ఆ నేత… బీఆర్ఎస్‌ను గద్దె దించే వరకు నిద్రలేకుండా శ్రమించారు. కాంగ్రెస్‌ను పవర్లోకి తెచ్చేందుకు రాజకీయంగా త్యాగాలకు సైతం రెడీ అన్నారు. రేవంత్‌రెడ్డిని సీఎం చేసేంతవరకు అవిశ్రాంతంగా పోరాటాలు చేశారు. అధికారం దక్కగానే తగిన గౌరవం ఇస్తామని ఆ ఉద్యమనేతకు చేతిలో చేయ్యేసి చెప్పింది హస్తం పార్టీ… మరి పదవి దక్కిందా? అంటే… ఔనని కాదని చెప్పలేని పరిస్థితి ఆయనది.. ఇస్తామన్న పదవి అలా గాలిలో వేలాడుతుండగా, ప్రభుత్వంపై వ్యతిరేకత ఆ నేత మెడకు చుట్టుకుంటోంది. దీంతో కక్కలేక.. మింగలేక అన్నట్లు తయారైందట ఆ ఉద్యమ నేత పొలిటికల్ జర్నీ… తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన ఆచార్య కోదండరాం స్టోరీయే ఇదంతా? కాంగ్రెస్ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న తెలంగాణ జనసమితి అధినేత కోదండరాంకి చివరికి మిగిలిందేంటి? కాంగ్రెస్‌తో కలిసి గులాబీ కోటను కూల్చేశారు.. తెలంగాణ ఉద్యమంతో ఓ వెలుగు వెలిగిన ఆచార్య కోదండరాం… రాజకీయంగా సక్సెస్ అయ్యారా? లేదా? అన్న ప్రశ్నకు ఎవరూ కచ్చితమైన ఆన్సర్ చేయలేకపోతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో రాజకీయంగా విభేదించిన కోదండరాం… సొంతంగా పార్టీ పెట్టినా… ప్రజల నుంచి ఆశించిన మద్దతు లభించలేదు. ఐతే సొంతంగా కేసీఆర్‌పై పైచేయి సాధించలేకపోయిన ప్రొఫెసర్ కోదండరాం…. 2018లోనే కాంగ్రెస్‌తో జట్టుకట్టి కారును గ్యారేజీకి పంపాలని శ్రమించినా ఫలితం దక్కలేదు. పట్టు వదలని విక్రమార్కునిలా మరోసారి గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి గులాబీ కోటను కూల్చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించి… ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా హస్తం పార్టీ విజయానికి దోహదపడ్డ ప్రొఫెసర్ కోదండరాంకి ఇప్పటివరకు ఎలాంటి పదవీ దక్కకపోవడంపై జన సమితి నేతల్లో తీవ్ర చర్చ సాగుతోంది. అధికారంలోకి వచ్చి 8 నెలలైనా.. ఇంతవరకు ఒక్క పదవీ దక్కలేదు.. ఒక ఎమ్మెల్సీ, రెండు నామినేటెడ్ పోస్టుల హామీతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ప్రొఫెసర్ కోదండరాం పార్టీకి ఇంతవరకు ఏ ఒక్క పదవీ దక్కలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలైనా.. కోదండరాంకి కానీ, ఆయన అనుచరులకు కాని ప్రభుత్వంలో ఎలాంటి గుర్తింపు లభించకపోవడంపై తెలంగాణ జనసమితి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత… ఆయన క్యాబినెట్లో కోదండరాంని తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ, అది ఉట్టి ప్రచారంగానే మిగిలిపోయింది. అప్పటి నుంచి కోదండరాం పేరు వెయిటింగ్ లిస్టులోనే.. ఆ తర్వాత నిరుద్యోగుల ఆలోచన ప్రకారం టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమిస్తారని మరో ప్రచారం జరిగింది. ఐతే టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని నియమించడంతో… కోదండరాం పేరు ఊహాగానాలకే పరిమితమైంది. అదేవిధంగా జనవరిలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండరాం పేరును సిఫార్సు చేసినా… కోర్టు జోక్యంతో ఆ నియామకం పెండింగ్‌లో పడిపోయింది. ఇక అప్పటి నుంచి కోదండరాం పేరు వెయిటింగ్ లిస్టులోనే పడిపోయింది. కోదండరామ్ ను టార్గెట్ చేస్తున్న నిరుద్యోగులు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊరిస్తున్న పదవులన్నీ… కోదండరాంకి దక్కకపోగా, ఆయనకు బాధ్యతలు ఎక్కువైపోయాయంటున్నారు. మాజీ సీఎం కేసీఆర్ సర్కార్ పతనానికి ప్రధాన కారణమైన నిరుద్యోగ సమస్య… ఇప్పుడు కోదండరాం మెడకు చుట్టుకుంటోందట. ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు… కోదండరాంనే టార్గెట్‌ చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరాం మాటలు వినే.. తామంతా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచామని.. కానీ ఇప్పుడు కొన్ని విషయాల్లో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ కోదండరాం ఇంటి ముందు ఆందోళనలకు దిగుతున్నారు నిరుద్యోగులు. ప్రొఫెసర్ కోదండరాంకు పొలిటికల్ కెరీర్ అచ్చిరాలేదంటూ కామెంట్లు.. అటు పదవీ దక్కక… ఇటు ప్రజలు, నిరుద్యోగుల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో… ప్రొఫెసర్ కోదండరాంకు పొలిటికల్ కెరీర్ అచ్చిరాలేదంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. తన మద్దతుతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయించగలుగుతున్న ప్రొఫెసర్ కోదండరాం… ప్రభుత్వంలో భాగం కాలేకపోతున్నారంటున్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్‌గా కీలకంగా పనిచేసిన కోదండరాం…. రాష్ట్రం ఆవిర్భవించిన పదేళ్ల తర్వాత కూడా ప్రభుత్వ పదవి దక్కించుకోలేకపోవడం, ముఖ్యంగా తానెంతో కోరుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం… సీఎం రేవంత్‌రెడ్డి హయాంలోనూ పదవి అందని ద్రాక్షగా మారడంపై రకరకాల చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమకు నామినేటెడ్ పదవులు వస్తాయని ఆశించిన తెలంగాణ జనసమితి నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. తమ నేతకే ఏ దిక్కులేకపోవడంతో తమనెవరూ పట్టించుకోవడం లేదని టీజేఎస్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రొఫెసర్‌ ఆవేదనను కాంగ్రెస్ హైకమాండ్ అర్థం చేసుకుంటుందా? ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు కాకపోవడం… కాంగ్రెస్ నేతలకు వరుసగా నామినేటెడ్ పదవులను కట్టబెడుతూ నిర్ణయాలు తీసుకుంటుండటం వల్ల టీజేఎస్‌ వర్గాలు ప్రొఫెసర్ కోదండరాంపై ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. తనకే ఏ పదవీ లేకపోవడం… తన వారిని ఎలా సర్దుబాటు చేయాలో తెలియక ఎరక్కపోయి.. ఇరుక్కుపోయామా? అంటూ టీజేఎస్ అధినేత నిర్వేదం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో టీజేఎస్ నేత ప్రొఫెసర్ కోదండరాం ఆవేదనను కాంగ్రెస్ హైకమాండ్ అర్థం చేసుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రొఫెసర్‌ నిరీక్షణకు ఎలాంటి ముగింపు పలుకుతుందో చూడాల్సివుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :