Studio18 News - తెలంగాణ / : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద నిన్న ఓ బ్యాగు కనిపించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో నల్లటి రంగులోని ఓ బ్యాగు కనిపించింది. ఈ బ్యాగు గురించి ఎవరూ రాకపోవడంతో పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం మెటల్ డిటెక్టర్‌తో బ్యాగును పరిశీలించి, దానిని స్వాధీనం చేసుకుంది.
Admin
Studio18 News