Studio18 News - తెలంగాణ / : Bandi Sanjay : హైదరాబాద్ శేరిలింగంపల్లిలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ.. క్విట్ ఇండియా అంటూ నినదించారు. విదేశాలకు వెళ్లి భారత ఎన్నికల వ్యవస్థను విమర్శిస్తావా? అంటూ రాహుల్ పై నిప్పులు చెరిగారు. రిజర్వేషన్లపై నోటికొచ్చినట్లు మాట్లాడతావా..? అంటూ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడం సీఎం రేవంత్ కు సాధ్యం కావడం లేదన్నారు బండి సంజయ్. కేసీఆర్ ఢిలీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని వచ్చారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అంతు చూసేటోళ్లం అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ”అంకుశం సినిమాలో రాంరెడ్డికి పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికి పట్టేది. కేసీఆరే దశమ గ్రహం. నవగ్రహాలు చేయడం విడ్డూరం. వరదలతో జనం అల్లాడుతుంటే కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు? ప్రజలు కేసీఆర్ కు ‘నో ఎంట్రీ బోర్డు’ పెట్టేశారు. ఇక రీ ఎంట్రీ కలే. 6 గ్యారంటీలపై డైవర్ట్ చేసేందుకే హైడ్రా పేరుతో ‘హైడ్రామా’లాడుతున్నారు. దేశ ప్రజలారా.. కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగండి. అత్యధిక సభ్యత్వ నమోదు చేసిన డివిజన్ కార్యకర్తలను నేను సన్మానిస్తా. ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ బీజేపీదే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేయడం తథ్యం. లౌకికవాదులారా.. జైనూర్ ఘటనపై నోరెందుకు మెదపడం లేదు..? హిందూ పండుగలపై ఆంక్షలు పెడుతుంటే ఎందుకు స్పందించరు? జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించని వాళ్లు నా దృష్టిలో భారతీయులే కాదు” అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు.
Admin
Studio18 News