Studio18 News - తెలంగాణ / : ప్రస్తుతం జరుగుతున్నది బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్‌కి మధ్య యుద్ధం కాదని, కౌశిక్ రెడ్డికి, తనకి మధ్య జరుగుతున్న యుద్ధమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు. నిన్న 11 గంటలకు తన ఇంటికి వస్తా అన్నారని, ఒకవేళ రాకపోతే తానే ఆయన ఇంటికి వెళ్తానని చెప్పానని తెలిపారు. అందుకే తాను ఆయన ఇంటికి వెళ్లానని అరికపూడి గాంధీ చెప్పారు. అయన తనను స్వాగతిస్తానని అంటేనే వెళ్లానని, తనను ఆహ్వానించి తన మీద కేసు నమోదు చేశారని అన్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దని కేసీఆర్ పదే పదే చెప్పారుని తెలిపారు. ఆంధ్ర వాళ్ల కాళ్లలో ముళ్లు గుచ్చుకుంటే తన నోటితో తీస్తానని కేసీఆర్ అన్నారని చెప్పారు. పాడి కౌశిక్ లాంటి వారి వల్లే బీఆర్ఎస్ పార్టీ నాశనం అవుతుందని అన్నారు. నిన్న ఏకంగా కౌశిక్.. డీసీపీ చొక్కా పట్టుకున్నారని చెప్పారు. బీఆర్ఎస్ వాళ్లే రాళ్లతో దాడి చేశారని తెలిపారు. కౌశిక్ తన ఇంటికి సమావేశానికి వస్తే స్వాగతిస్తానని, టేబుళ్లు, కుర్చీలు రెడీగా పెట్టానని చెప్పారు. అలాగే, టిఫిన్లు, భోజనాలు కూడా సిద్ధం చేయించానని అన్నారు.
Admin
Studio18 News