Studio18 News - తెలంగాణ / : హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ బాయ్స్ హాస్టల్లో డ్రగ్స్ కలకలం రేగింది. బాయ్స్ హాస్టల్లో డ్రగ్స్ సేవిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. హాస్టల్లో పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. గత కొన్నాళ్ల నుంచి బాయ్స్ హాస్టల్‌కి డ్రగ్స్ సరఫరా చేస్తున్న యువకులను అరెస్ట్ చేశారు. మరోవైపు, నగరంలోని పలు బాయ్స్ హాస్టళల్లో ఎక్స్చేంజ్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు చేసి సుమారుగా 12 లక్షలు రూపాయల విలువ చేసే డ్రగ్స్‌ను పట్టుకున్నారు. 250 గ్రాముల గంజాయి, 115 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలోని ముగ్గురు కీలక వ్యక్తులు అరెస్టయ్యారు. మాదాపూర్ రేవ్ పార్టీ కేసులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారి వివరాలు సేకరించిన క్రమంలో వచ్చిన సమాచారం మేరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసింది ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ఈ ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తోంది. బెంగళూరుకు చెందిన మోహిత్ లోకేశ్ రావు పసుపులేటి దత్తు, కె.ఎం రవూఫ్, నైజీరియాకు చెందిన నెగ్గెన్ తో సంబంధాలు ఉన్నాయి. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలహాసర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఇటీవల మాదాపూర్ లోనీ క్లౌడ్ నైన్ అపార్ట్మెంట్ లో ఓ రేవ్ పార్టీ భగ్నం చేశామని, 20 మందిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. నాగరాజు యాదవ్ తో పాటు మరో నిందితుడ్ని అరెస్ట్ చేశామని, వారిని విచారించే క్రమంలో బెంగళూరు నుండి హైదరాబాదు కు డ్రగ్స్ వస్తున్న విషయం వెల్లడయిందని తెలిపారు. దీంతో మరింత లోతుగా ఈ కేసును విచారించినపుడు ఎస్సార్ నగర్ లో హాస్టల్స్ కేంద్రంలో గంజాయి, డ్రగ్స్ గుట్టు రట్టయిందని చెప్పారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలోని కీలక వ్యక్తులు మోహిత్ రావు, పసుపులేటి, రవూఫ్ ను అరెస్టు చేశామమని తెలిపారు.
Admin
Studio18 News