Studio18 News - తెలంగాణ / : Padi Kaushik Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు కొనసాగనున్నాయి. ఇవాళ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు. పలు శాఖల రిపోర్ట్ ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. సభలో జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం విడుదల చేయనుంది. జాబ్ క్యాలెండర్ కు చట్టబద్ధతపై చర్చ జరగనుంది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు మీడియా పాయింట్ వద్ద హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బీఅర్ఎస్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందో లేదో కానీ మీరు అమెరికా వెళ్లి వచ్చే వరకు సభ్యత్వం రద్దు అయ్యేలా ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి బెదిరిస్తే బయటపడే వాళ్ళులేరని అన్నారు. అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డిని అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. అమెరికా వెళ్లి వచ్చే వరకు మీ సభ్యత్వం ఉంటాదో లేదో చూసుకో .. ఖమ్మం, నల్గొండ మంత్రులు మీ సభ్యత్వం రద్దు చేసేలా ఉన్నారని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లో మైక్ ఇవ్వడం లేదు. ప్రజా సమస్యలను లేవనెత్తే అవకాశం కల్పించడం లేదని ఆరోపించారు. హుజురాబాద్ ప్రజలకు రెండవ విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని అన్నారు. హుజురాబాద్ లో ఫైర్ యాక్సిడెంట్ అయితే ప్రభుత్వం స్పందించలేదు. నా జీతం నుంచి 4లక్షలు వాళ్లకు ఇచ్చానని అన్నారు. హుజురాబాద్లో పొన్నం ప్రభాకర్ మిత్రుడు మీడియాను ఇబ్బంది పెడుతున్నాంటూ కౌశిక్ రెడ్డి అన్నారు.
Admin
Studio18 News