Studio18 News - తెలంగాణ / : Crows Attack in Sircilla : మగవాళ్లపై కాకులు పగబట్టాయి. కేవలం మగవాళ్ల తలపై కాళ్లతో తన్నుతూ కాకులు దాడి చేస్తున్నాయి. విచిత్రంగా ఉన్నా నమ్మితీరాల్సిందే. ఇందుకు సంబంధించిన వీడియోసైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. సిరిసిల్ల పాత బస్టాండ్ లో కట్టమైసమ్మ గుడివద్ద తిరుగుతున్న మగవాళ్లపై కాకులు కాళ్లతో దాడి చేస్తున్నాయి. బస్టాండ్ నుంచి బయటకు వెళ్లే వారిపై, లోపలికి వచ్చే మగవాళ్లను మాత్రమే తలపై తన్నుతూ చెట్టు కొమ్మపైకి వెళ్లి వాలుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. అక్కడి కాకులు మగవాళ్లపైనే ఎందుకు దాడిచేస్తున్నాయంటూ ప్రశ్నిస్తున్నారు.
Admin
Studio18 News