Studio18 News - తెలంగాణ / : సంగారెడ్డి నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్తున్న బస్సులో ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో జరిగిన అత్యాచార ఘటన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈమేరకు డీసీపీ బాలస్వామి మీడియాతో మాట్లాడుతూ... తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు అర్ధరాత్రి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. హరికృష్ణ ట్రావెల్స్‌కు సంబంధించి నెల్లూరుకు చెందిన ఈర్ల కృష్ణబాబు, ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధయ్య అనే ఇద్దరు డ్రైవర్లను అరెస్ట్ చేశామన్నారు. సంగారెడ్డి నుంచి వస్తుండగా చేగుంటలో భోజనం చేశారని, అక్కడి నుంచి సిద్ధయ్య బస్సును డ్రైవ్ చేసినట్లు చెప్పారు. కృష్ణబాబు బాధితురాలిని రేప్ చేస్తే... సిద్ధయ్య సహకరించాడన్నారు. బాధితురాలితో మాటలు కలిపి అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పారు. బాధితురాలు తన కూతురుతో ప్రయాణిస్తోందని, ఒకే బెర్త్ బుక్ చేసుకుందన్నారు. అయితే వెనక్కి వెళ్లాలని నిందితుడు... కూతురుకు చెప్పాడన్నారు. నిన్ననే యాచారం స్టేషన్ పరిధిలో నిందితులను అరెస్ట్ చేశామన్నారు. బాధితురాలి భర్త ఏడేళ్ల క్రితం మరణించినట్లు చెప్పారు. నిందితులను ఈ రోజు రిమాండ్ చేస్తున్నామన్నారు.
Admin
Studio18 News