Studio18 News - తెలంగాణ / : Traffic jam in Uppal: హైదరాబాద్ వాసులు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా వర్షం పడినప్పుడు భాగ్యనరంలో ట్రాఫిక్ వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా స్తంభించడంతో హైదరాబాదీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేవారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి కష్టాలు చవిచూశారు. ఉప్పల్లో భారీగా నిలిచిన వాహనాలతో వరంగల్ – హైదరాబాద్ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి అన్నొజిగూడా వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గత రాత్రి నుంచి ఉదయం వరకు కురిసిన వర్షంతో రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనాలు నెమ్మదిగా కదలడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి పరిస్థితిని చక్కదిద్దారు. నానాక్‌రామ్‌గూడ టోల్‌గేట్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. మూడు కిలోమీటర్ల దూరం వరకు వందలాది వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకుపోయాయి. అంబులెన్స్ వెళ్లేందుకు సైతం ఖాళీ లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ ప్రాంతంలో పలు కార్పొరేట్ ఆసుపత్రులు ఉండడంతో హాస్పిటల్ పనుల మీద వెళ్లే వారికి తీవ్ర అసౌకర్యం కలిగింది. ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఆఫీసులకు వెళ్లడం లేటవుతోందని వాపోయారు.
Admin
Studio18 News