Studio18 News - తెలంగాణ / : ఖర్గే గారూ, మీరు చెప్పినట్లుగా ఒకరి ఇంటిని కూల్చేసి, వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా చేయడం అమానవీయం, అన్యాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మహబూబ్ నగర్ పట్టణ సమీపంలో ఇళ్లను కూల్చివేసిన ఘటనపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. గతంలో బుల్డోజర్ పాలనపై ఖర్గే చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఒకరి ఇంటిని కూల్చివేసి, వారి కుటుంబాన్ని నిరాశ్రయులను చేయడం అమానవీయం, అన్యాయం" అని ఖర్గే గతంలో ట్వీట్ చేశారు. దీనిని కేటీఆర్ ప్రస్తావించారు. మీరు చెప్పినట్లు కూల్చివేతలు దారుణమని ఖర్గేను ఉద్దేశించి అన్నారు. తెలంగాణలోనూ చట్టం, న్యాయవ్యవస్థ పట్ల తీవ్ర ధిక్కారం కనిపిస్తోందని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ పట్టణంలో 75 పేదల ఇళ్లను తెల్లవారుజామున 3 గంటలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా కేటీఆర్ పోస్ట్ చేశారు. ఇళ్లు కోల్పోయిన ఈ నిరుపేదల్లో 25 కుటుంబాలు వికలాంగులవేనని తెలిపారు. సరైన విధివిధానాలు లేని చట్టం చట్టమే కాదన్నారు. దయచేసి తెలంగాణను ఈ దేశంలో మరో బుల్డోజర్ రాజ్‌గా మారకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వండని ఖర్గేకు సూచించారు.
Admin
Studio18 News