Studio18 News - తెలంగాణ / : Car Accident In Hyderabad : హైదరాబాద్ పరిధిలోని గోల్కొడ ఇబ్రహీంబాగ్ లో కారు బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. రాంగ్ రూట్ లో వేగంగా దూసుకొచ్చిన కారు బైక్ ను ఢీకొట్టింది. బైక్ పై వెళ్తున్న చిన్నారి(7) మృతి చెందగా.. చిన్నారి తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. కారులోని వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న గోల్కొండ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కారు డ్రైవ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోల్కొండ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీకి చెందిన రమేశ్ ప్రైవేట్ ఉద్యోగి. తన కుమారుడు శౌర్య, భార్యను తీసుకొని ఇబ్రహీంబాగ్ నుంచి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. అదే సమయంలో షేక్ పేట మారుతీనగర్ కాలనీకి చెందిన శ్రీనాథ్ అనే యువకుడు కారును మద్యం మత్తులో నడుపుతూ వేగంగా వచ్చి రమేశ్ బైక్ ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శౌర్య, అతని భార్యకు గాయాలు కాగా.. చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించే సమయానికే శౌర్య మృతిచెందగా.. రమేశ్, అతని భార్య తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. పోలీసులు కారు డ్రైవర్ తో పాటు, కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. మద్యం సేవించి రాగ్ రూట్ లో కారు నడిపి చిన్నారి మృతికి కారణమైన నిందితుడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Admin
Studio18 News