Saturday, 14 December 2024 06:06:17 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Arekapudi Gandhi: నాపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి: అరెకపూడి గాంధీ

Date : 13 September 2024 03:29 PM Views : 44

Studio18 News - తెలంగాణ / : తనను ఆంధ్రోడన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి బతకడానికి హైదరాబాద్ కు వచ్చినట్టే తాను కూడా హైదరాబాద్ కు వచ్చానని ఆయన చెప్పారు. ఎంతో మందిని చీటింగ్ చేసిన కౌశిక్ రెడ్డితో తనకు పోలికేంటని ఎద్దేవా చేశారు. తనను బీఆర్ఎస్ పార్టీలో చేర్పించింది హరీశ్ రావు అని చెప్పారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని తెలిపారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అసెంబ్లీ స్పీకర్ కూడా ప్రకటించారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని కౌశిక్ రెడ్డి నాశనం చేశారని గాంధీ దుయ్యబట్టారు. కౌశిక్ రెడ్డి చీటర్, బ్రోకర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన మనోభావాలు దెబ్బతినడం వల్లే తాను ప్రతిస్పందించాల్సి వచ్చిందని చెప్పారు. పదేపదే తనను రెచ్చగొట్టడం వల్లే స్పందించాల్సి వచ్చిందని అన్నారు. పిల్లిని గదిలో బంధించి కొడితే... అది కూడా తిరగబడుతుందని చెప్పారు. సెటిలర్ల కాలిలో ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని గతంలో కేసీఆర్ చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సూచించిన వారికే పీఏసీ పదవి ఇవ్వాలని ఏమీ లేదన్నారు. గతంలో పీఏసీ పదవిని కాంగ్రెస్ నేతకు కాకుండా అక్బరుద్దీన్ ఒవైసీకి ఎందుకిచ్చారని ప్రశ్నించారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు 'ఛలో గాంధీ' నివాసానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :