Saturday, 17 January 2026 10:07:32 AM
# Special Trains | సంక్రాంతి పండుగకు విశాఖ -విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు # Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి # Nara Lokesh: నారావారిపల్లె చేరుకున్న మంత్రి నారా లోకేశ్ కు ఆత్మీయ స్వాగతం... ఫొటోలు ఇవిగో! # KTR | పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని పండబెట్టి తొక్కుతరు : కేటీఆర్‌ # KTR | దండంపెట్టి చెబుతున్నా.. మున్సిపల్‌ ఎన్నికల నుంచే మన జైత్రయాత్ర మొదలుగావాలె : కేటీఆర్‌ # Revanth Reddy: ఒక్కరోజు సెలవు తీసుకుందామనుకున్నా ఏదో ఒక పని వచ్చిపడుతోంది: రేవంత్ రెడ్డి # Pawan Kalyan: పిఠాపురం సంక్రాంతి వేడుకలను కొనియాడుతూ పవన్ కల్యాణ్ స్పందన # Chandrababu Naidu: సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లె చేరుకున్న సీఎం చంద్రబాబు... షెడ్యూల్ ఇదిగో! # Annamalai: ముంబై వస్తా... నా కాళ్లు నరకడానికి ప్రయత్నించండి: రాజ్ థాకరే వ్యాఖ్యలకు అన్నామలై ఘాటు కౌంటర్ # Bangladesh | బంగ్లాదేశ్ లో మరో హిందువు మృతి.. పోలీసు కస్టడీలో మరణించిన హిందూ నేత # Kavya Maran: ఇంగ్లండ్ లీగ్ లో జట్టును కొనుగోలు చేసిన కావ్యా పాప... టీమ్ పేరు ఇదే! # Mamata Banerjee: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఈసీకి మరోసారి మమతా బెనర్జీ లేఖ # Kalvakuntla Kavitha: తెలంగాణ సర్కారుకు సుప్రీంకోర్టు షాక్... స్పందించిన కవిత # WPL 2026: ఆ రెండ్రోజులు ప్రేక్షకులు లేకుండానే డబ్ల్యూపీల్ మ్యాచ్ లు! # Kamal Haasan: కమల్ హాసన్ ‘పర్సనాలిటీ రైట్స్‌’కు రక్షణ... అనధికార వాడకంపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు # Websol Renewable: ఏపీకి మరో భారీ పెట్టుబడి.. నాయుడుపేటలో ₹3,538 కోట్లతో వెబ్‌సోల్ సోలార్ ప్లాంట్ # Chandrababu Naidu: నేడు వివేకానందుడి జయంతి ..యువతకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు # Donald Trump: తనను తాను వెనెజువెలా అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ట్రంప్ # Nagasaayi: విజయవాడలో అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు # : ఎన్నికల హామీ నెరవేర్చేందుకు 300 కుక్కలను చంపించిన సర్పంచ్ లు.. హనుమకొండ జిల్లాలో ఘటన

IRCTC: బాల రాముడిని, కాశీనాథుడిని దర్శించుకునే అవకాశం.. సికింద్రాబాద్ నుంచి ఐఆర్ సీటీసీ టూర్ వివరాలు ఇవిగో!

Date : 21 August 2024 03:07 PM Views : 273

Studio18 News - TELANGANA / : అయోధ్య బాల రాముడిని, కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడానికి ఇండియన్ రైల్వే సరికొత్త టూర్ ను ప్రకటించింది. గంగా సరయూ దర్శన్ పేరుతో ఐఆర్ సీటీసీ తీసుకొచ్చిన ఈ టూర్ ప్రతీ ఆదివారం మొదలవుతుంది. ఐదు రాత్రులు, ఆరు పగళ్లు కొనసాగుతుంది. వచ్చే నెల 22 నుంచి బుకింగ్ అందుబాటులో ఉంది. ఉత్తరాదిలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు తెలంగాణ వాసులకు ఇదొక చక్కని అవకాశం. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు వివిధ జంక్షన్ లలో ఈ రైలు ఎక్కే అవకాశం ఉంది. సికింద్రాబాద్ నుంచి ప్రారంభం.. ఆదివారం ఉదయం 9:25 గంటలకు దానాపూర్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా ప్రయాణం. సోమవారం మధ్యాహ్నం 1:30 గంటలకు వారణాసి స్టేషన్ కు చేరుకుంటారు. ముందుగా బుక్ చేసిన హోటల్ లో బస చేసి సోమవారం సాయంత్రం గంగా హారతి, కాశీ టెంపుల్ దర్శనం. రాత్రి అక్కడే వసతి. మంగళవారం కాశీ విశ్వనాథ ఆలయం, కాలభైరవ్ మందిర్, బిర్లా మందిర్ తదితర ఆలయాల సందర్శన. సాయంత్రం షాపింగ్, సైట్ సీయింగ్. బుధవారం బ్రేక్ ఫాస్ట్ చేసి అయోధ్యకు పయనం. హోటల్ లో దిగి ఫ్రెషప్ అయ్యాక బాలరాముడి ఆలయం, హనుమాన్ గర్హి, దశరథ్ మహల్ సందర్శన. సాయంత్రం సరయూ ఘాట్ సందర్శన, రాత్రికి ప్రయాగ్ రాజ్ లో వసతి గురువారం బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసి హోటల్ నుంచి చెక్ ఔట్.. ప్రయాగ్ రాజ్ జంక్షన్ నుంచి రాత్రి 7:45 గంటలకు తిరుగు ప్రయాణం. శుక్రవారం రాత్రి 9:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. టికెట్ ధరలు ఇలా.. థర్డ్ ఏసీలో రూ.41,090 (సింగిల్ షేరింగ్), రూ.24,350 (ట్విన్ షేరింగ్), రూ.19,720 (ట్రిపుల్ షేరింగ్).. పిల్లల (5 నుంచి 11 ఏళ్లు) కు బెడ్ తో రూ.15,390, వితౌట్ బెడ్ తో రూ.13,790 స్లీపర్ బెర్త్ లో రూ.21,620 (సింగిల్ షేరింగ్), రూ.17,220 (ట్విన్ షేరింగ్), రూ.16,710 (ట్రిపుల్ షేరింగ్).. పిల్లల (5 నుంచి 11 ఏళ్లు) కు బెడ్ తో రూ.13,620, వితౌట్ బెడ్ తో రూ.12,010 టూర్ లో ఇతరత్రా ఏర్పాట్లు.. థర్డ్ ఏసీ బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఏసీ గదులు, ఏసీ వాహనం ఏర్పాటు చేస్తారు. మూడు రోజులు ఉదయం టిఫిన్, రాత్రి భోజనం ప్యాకేజీలో భాగంగా ఏర్పాటు చేస్తారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా టికెట్ ధరలోనే ఉంటుంది. టూర్ లో భాగంగా వెళ్లే పర్యాటక ప్రదేశాల్లో ఎంట్రన్స్ టికెట్, ట్రైన్ లో భోజనం, ఆలయాల్లో దర్శన టికెట్, టూర్ గైడ్ తదితర ఖర్చులు యాత్రికులే భరించాల్సి ఉంటుంది. వివరాలకు.. ఐఆర్ సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్ సికింద్రాబాద్.. మొబైల్: 8287932229 / 8287932228 / 9701360701

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :