Monday, 15 December 2025 01:44:44 AM
# Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ! # Bhagwant Mann: రాహుల్, సిద్ధూలకు ఒకే సమస్య.. పని చేయకుండానే పదవులా?: భగవంత్ మాన్ # Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళం... నిర్వాహకుడి అరెస్ట్ # Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట... లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణ # Indigo Airlines: పుంజుకుంటున్న ఇండిగో కార్యకలాపాలు... నేడు కూడా 2 వేలకు పైగా విమానాలు # Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం, స్పష్టమైన చర్యలతో విజయం సాధిస్తాం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ # Nitish Kumar Reddy: హ్యాట్రిక్ ఫీట్ పై నితీశ్ కుమార్ రెడ్డి కామెంట్స్

AP Rains: తీరానికి చేరువలో వాయుగుండం... ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు 20-07-2024 Sat 14:39 | Andhra

Date : 20 July 2024 04:41 PM Views : 357

Studio18 News - TELANGANA / : వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఒడిశాలోని చిలికా సరస్సుకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం గత మూడు గంటలుగా అదే ప్రాంతంలో స్ధిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ వాయుగుండం ఒడిశాలోని పూరీ తీరానికి నైరుతి దిశగా 40 కిలోమీటర్లు, గోపాల్ పూర్ కు ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమేపీ వాయవ్యంగా కదులుతూ, ఒడిశా-ఛత్తీస్ గఢ్ భూభాగాలపైకి వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఇది రాగల 12 గంటల్లో బలహీనపడి తిరిగి అల్పపీడనంగా మారనుందని ఐఎండీ తెలిపింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశముందని వివరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. రాగల 24 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలో అనేక ప్రాంతాల్లో 5 సెం.మీ కంటే అధిక వర్షపాతం నమోదైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :